రైల్వే సిబ్బందికి వైద్యసేవలు అందించకుంటే చర్యలు

శ్రీకాకుళం, జూలై 23 : రైవ్వే సిబ్బందికి పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించాలని ఈస్లుకోస్టు రైల్వే ఆరోగ్యశాఖ చీఫ్‌ సూపరింటెండెంట్‌ సి.ఆర్‌.పండా రైల్వే వైద్యాధికారులకు ఆదేశించారు. శ్రీకాకుళం(ఆమదాలవలస)రోడ్డు రైలు నిలయంలోని రైల్వే ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సిబ్బంది తక్కువగా ఉన్నారని, రైల్వే సిబ్బందికి వైద్యసేవలందించేందుకు శ్రీకాకుళం పట్టణంలోని రిమ్స్‌, ఆమదాలవలసలోని సత్యసాయి ఆసుపత్రులకు అనుమతులివ్వాలని ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కోరుతూ వినతిపత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఉద్యోగులు కృష్ణారావు, మల్లేశ్వరరావు, సెల్వం తదితరులున్నారు.