రైల్వే సిబ్బంది మహా ధర్నా

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయం ఎదురుగా దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్‌ సంమ్‌ ఎస్‌ఎఫ్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. దేశ వ్యాప్తంగా ఈనెల 18నుంచి 22వరకు కొనసాగిన ధర్నా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రైల్‌ నిలయం ఎదురుగా ధర్నా చేస్తున్నట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొన్నారు. తమ 57డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గతంలో రరైల్వే బోర్డుకు లిఖిత పూర్వకంగా వినతి పత్రం ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. తమ డిమాండ్లు పట్టించుకోకపోతే దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు.