రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ యూనివర్శిటీ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఆగివున్న జీపును కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.