రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చమన్‌

జగ్గయ్యపేట: కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దివంగత  పరిటాల రవీంద్ర అనుచరుడు చమన్‌ గాయపడ్డారు. అనుమంచిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న కారును అనుమంచిపల్లి వద్ద లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చమన్‌తో పాటు కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్పంగా గాయపడ్డారు.