రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుళ్లు మృతి

మచిలీపట్నం:  మచిలీపట్నం శివారు శివగంగ డ్రైయిస్‌  సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుళ్లు మృతిచెందారు. మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రమానికి చెందిన ఆదిలక్ష్మి, పావని ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని బందరు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించి చికిత్సచేస్తున్నారు. చల్లపల్లి వైపు నుంచి వస్తున్న ట్రాక్టరు మచిలీపట్నం నుంచి చల్లపల్లి వైపు వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.