రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి

భువనగిరి(నల్గొండ): భువనగిరి పట్టణంలోని మొయిన్‌రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తులసి(35) అనే వివాహిత మృతి చెందింది. ఇలిగొండ మండలం దాసిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన బందారపు నరసింహ, అతని భార్య తులసి ఆలేరు నుంచి స్వగ్రామం వెళ్తుండగా ఎదురుగా వచ్చి లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలోనే తులసి మృతి చెందింది. భర్త నరసింహకు తీవ్ర గాయాలయ్యాయి.