రోడ్డు ప్రమాదంలో వృద్దురాలి మృతి

కొండపాక: మండలంలోని దుద్దెడ గ్రామానికి చెందిన గున్నాల రామవ్వ (70) అనే మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.దుద్దెడలోని తమ కొడుకు నిర్వహిస్తున్న హోటల్‌ లో టీ తాగటానికి వెళ్లి వస్తుండగా ఆక్సిజన్‌ సిలిండర్లతో వెళుతున్న ఆటో ఢీ కొట్టింది.దీంతో ఆమె తీవ్రగాయాలపాలైంది. వెంటనే ఆమెను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో చనిపొయింది.