రోడ్లు సరే… డ్రైనేజీలు ఎక్కడా

ఒంగోలు, జూన్‌ 24 : ఉలవపాడు మండలం ఆత్మకూరు గ్రామంలో రోడ్లు వేసిన అధికారులు డ్రైనేజీలు మరవడం విడ్డూరం. గ్రామాల్లో వర్షాకాలం ప్రవేశిస్తే సీజనల్‌ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా తదితర ప్రాణాంతక వ్యాధులతో ప్రజలు తమ ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోల్పోవాల్సిన పరిస్థితులు ఈ ప్రాంతంలో నెలకొని ఉన్నాయి. ఈ తరుణంలో రోడ్లు వేసిన ప్రభుత్వ అధికారులు డ్రైనేజీలు మరచి, మీ కర్మమీది అన్న విధంగా ప్రజలను వదలడం భావ్యమా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.