లంచం తీసుకుంటూ పట్టుబడిన వీఆర్వో

విశాఖ: విశాఖ జిల్లా ఎస్‌. రాయవరం మండలంలోని వమ్మవరం వీఆర్వోగా పనిచేస్తున్న మారేశ్వరరావు బుధవారం లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇదే గ్రామానికి చెందిన పల్లేల బుల్లెబ్బాయి పట్టాదారు పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సంవత్సరకాలంగా పాసుపుస్తకం ఇవ్వకుండా తిప్పుకుంటూ రూ.4000 ఇవ్వమని డిమాండ్‌ చేశాడు. బుధవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.