లండన్‌ గేమ్స్‌ సెమిస్‌లో ఫెదరర్‌, ముర్రే

మహిళల సింగిల్స్‌లో షరపోవా జోరు
లండన్‌ : వరల్డ్‌ నంబర్‌ వన్‌ వింబుల్డన్‌ ఛాంపియన్‌ రోజర్‌ ఫెదరర్‌ లండన్‌ ఒలంపిక్స్‌లో దూసుకెళ్తున్నాడు. కెరిర్‌లో తోలి వ్యక్తిగత మెడల్‌పై కన్నెసిన ఫెధరర్‌ దానికి రెండు అడుగుల దూరంలో నిలిచాడు. తాజాగా ఈ స్విస్‌ టెన్నిస్‌ స్టార్‌ 6-4, 7-6 తేడాతో అమెరికాకు చెందిన జాన్‌ ఇస్నార్‌ పై విజయం సాధించాడు. ఫెధరర్‌ ఒలంపిక్స్‌ సెమిస్‌లో అడుగు పెట్టాడం 2000 తర్వాత ఇదే తొలిసారి. ఫైనల్లో ఈ స్విస్‌ థండర్‌ అర్జెంటినా ఆటగాడు మార్టిన్‌ డెల్‌ పొట్రొతో తలపడనున్నాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో మాజీ నంబర్‌ వన్‌ సెర్బియన్‌ స్టార్‌ నోవక్‌ జోకోవిచ్‌ సోంగాపై విక్టరీ కొట్టాడు బీజింగ్‌ ఒలంపిక్స్‌లో కాంస్యం నెగ్గిన జోకోవిచ్‌ 6-1 , 7-5 తేడాతో సోంగా జోరుకు బ్రేక్‌ వేశాడు. అలాగే బ్రిటన్‌ సంచలనం ఆండీ ముర్రే కూడా సేమీస్‌కు చేరుకున్నాడు. వింబుల్డన్‌ రన్నరఫ్‌గా నిలిచిన ముర్రే స్వంత గడ్డపై మరోసారి ఆదృష్టం అయపరిక్షించుకొనున్నాడు. క్వార్టర్‌ ఫైనల్‌లో ముర్రే 6-4 , 6-1 తేడాతో స్పెయిన్‌కు చేందిన 11వ సీడ్‌ నికోలస్‌ ఆల్మాగ్రోపై గెలుపొందాడు. సెమీఫైనల్‌లో ముర్రే , జోకోవిచ్‌తో తలపడనున్నాడు. అటు మహిళ సింగిల్స్‌లో రష్యన్‌ బ్యూటీ షరపోవా కూడా సెమీస్‌కు చేరుకుంది. క్వార్టర్‌ ఫైనల్‌లో షరపోవా 6-2 , 7-5 స్కోర్‌తో బెల్జియం క్రీడకారిణి కిమ్‌ క్లియోస్టార్‌ పై నెగ్గింది. ఫైనల్‌లో చోటుకోసం షరపోవా 14వ సీడ్‌ కిర్లిక్‌తో తలపడనుంది.