లక్ష్మీపేట ఘటనకు బొత్స, కొండ్రులదే బాధ్యత

హైదరాబాద్‌:  శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట గ్రామంలో దళితులపై జరిగిన హత్యాకాండకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి కొండ్రు మురళీ బాధ్యత వహించాలని షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. సాగుభూమిని ఆక్రమించుకోడానికే బొత్స సత్యనారాయణ బంధువు బొత్స వాసుదేవరావు ఈ హత్యాకాండ చేయించారని సంఘం నాయకులు హైదరాబాద్‌లో ఆరోపించారు. ఈసంఘటనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ స్పందించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ సంఘటనపై సీబీఐ విచారణ జరిపింది దోషులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.