లక్ష్యానికి చేరువగా మొక్కల పెంపకం

ఆయా శాఖల ఆధ్వర్యంలో పూర్తి చేసేలా కార్యాచరణ

ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు

హైదరాబాద్‌,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఇచ్చిన పిలుపు ఫలిస్తోంది. హరితహారం కింద నాటిన మొక్కలు పెరుగుతన్నాయి. ప్రభుత్వం రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమం చేపట్టింది. అటవీశాఖ, ఉపాధిహావిూ శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని చేపట్టారు. నాలుగో విడత మొక్కలు నాటేందుకు నిర్దేశించిన లక్ష్యానికి చేరువలో ఉన్నారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించుకోవాలన్న పిలుపుతో గ్రామాల్లో మొక్కల సంరక్షణకు ప్రాధనా/-యం ఇస్తున్నారు. జిల్లాల్లో రితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ ప్రాతాల్లో మొక్కలు నాటుతున్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటుండగా ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. దీంతో మొక్కలు నాటే కార్యక్రమంతో గ్రామాలు సందడిగా మారాయి. ఈ విడతలో అధికారులు విద్యార్థులకు ఆరు మొక్కలను పంపిణీ చేసే కుటుంబ సభ్యుల సహకారంతో వాటి పెంచే బాధ్యతలను అప్పగించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో రహదారులకు ఇరువైపులా, అటవీ ప్రాంతాల్లో భారీగా పెరిగే నాటుతుండగా డీఆర్‌డీవో ఆధ్వర్యంలో ప్రజలకు అవసరమైన పండ్లు, పూలుఇతరమొక్కలనుపెంచుతున్నారు. అంతర్రాష్ట్ర రహదారికి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్‌ కింద నాటిన మొక్కలను పరిశీలించారు. సొనాలలో చేయూత ఆధ్వర్యంలో ఇటీవల నాటిన మొక్కలను పరిశీలించారు. మాబడి తోట కింద కూరగాయల చెట్ల పెంపకం కోసం అవసరమైన విత్తనాలను అందించారు. జిల్లాలో మూడు విడతలుగా చేపట్టిన హరితహారం విజయవంతం అయ్యింది. నాలుగో విడత కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. గతేడాది మూడో విడత హరితహారంలో జిల్లాలో కోటి మొక్కలు నాటగా నాలుగో విడతలో కూడా మొక్కలను నాటి పెంచాలని అధికారులు లక్ష్యంగా ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ముందస్తు ప్రణాళికలు తయారు చేశారు. అటవీశాఖ, డీఆర్‌డీవోల ఆధ్వర్యంలో జిల్లాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలను పెంచారు. ఈ ఏడాది వానాకాలం సీజన్‌ ప్రారంభం నుంచి వానలు పడుతుండడంతో హరితహారం కార్యక్రమం జోరుగా సాగుతోంది. అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు లక్ష్యం మేరకు మొక్కలు నాటారు. వీటితో పాటు మరో 24 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జోరుగా సాగుతోంది. గీత కార్మికులకు ఉపాధి కల్పించడంతో భాగంగా ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఈత మొక్కల పెంపకాన్ని చేపట్టారు. సీతాఫలంతో పాటు మేలు రకమైన మామిడి, ఇతర పూలు, పండ్ల మొక్కలను ప్రజలకు సరఫరా చేస్తున్నారు. హరిత పాఠశాల – హరిత తెలంగాణ కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలలో మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. మా బడి తోటలో భాగంగా పాఠశాలల ఆవరణలో కూరగాయల, ఆకుకూరల పెంపకాన్ని చేపట్టారు. నా టిన మొక్కలను సంరక్షించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నారు. మొక్కకు ట్రీ గార్డులను ఏర్పాటు చేయడంతో పాటు స్థానికులతో పాటు వివిధ శాఖల సిబ్బంది వాటి రక్షణ బాధ్యతను తీసుకుంటున్నారు. ప్రతి మొక్కను గుర్తించే విధంగా మొక్కకు జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సీజన్‌ ప్రారంభం నుంచి వాతావరణం మొ క్కల పెంపకానికి అనుకూలంగా ఉంది. వర్షాల బాగా పడుతుండడంతో గ్రామాల్లో హరితహారం కార్యక్రమం జోరుగా సాగుతోంది.