లారీ, ఆటో ఢీ.. ఇద్దరి మృతి

వినుకొండ: వినుకొండ సమీపంలోని విఠంరాజుపల్లె వద్ద ఆటోను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సావల్యపురం మండలం పోట్లూరు నుంచి ప్రయాణికులతో వినుకొండకు వస్తున్న ఆటోను గుంటూరు వైపునకు వెళ్తున్న  లోడ్‌ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం  చోటుచేసుకుంది. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.