లారీ ఢీకొని ఒకరు.. కారు ఢీకొని ఇంకొకరు మృతి

అడ్డాకుల: మండలంలోని సంకలమద్ది జాతీయ రహదారిపై గురువారం రోడ్డు దాటుతున్న ఒక మహిళను ఇసుక లారీ ఢీకొంది. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భూత్పుర్‌ మండలం శేరిపల్లి గ్రామ బస్టాండ్‌ వద్ద కూడా రోడ్డు దాటుతున్న చెన్నయ్య అనే వ్యక్తిని కారు ఢికొనటంతో అతనూ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.