వచ్చె నెల 8,9 తేదిల్లో అన్ని భూకెటాయింపులపై సమీక్షిస్తాం:పీఏసీ

హైదరాబాద్‌: శాసనసభా కమీటి హాలులో చైర్మన్‌ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన పీఏసీ రెవెన్యూ, ఇందనం, పశుసంవర్ధక శాఖలపై కాగ్‌ లేవనెత్తిన అభ్యంతరాలను సమీక్షించింది. విశాఖ పర్యటనలో భూకేటాయింపుల్లో  వెలుగు చూసిన అక్రమాలను పరీశిలించిన సభ్యులు మొత్త భూకెటాయింపులను ప్రాంతాలవారిగా భూకేటాయింపులపై రెవెన్యూ,పురపాలక, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శిలతో అధికారుల కమీటి ఏర్పాటు చేయాలని, హైదరాబాద్‌,తీరుపతి,విశాఖ కేంద్రాలుగా మూడు ఉప సంఘాలు ఏర్పాటు చేయాలని, హిందూజ పవర్‌ప్లాంట్‌ భూకేటాయింపులపై వారంలో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. భూకేటాయింపుల్లో భారీగా అక్రమాలు జరిగాయని పేదల భూములు కొల్లగొట్టారని విపక్ష సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వమే రియల్‌ఎస్టేట్‌ బ్రోకర్‌గా వ్యవహరించిదని అన్నారు. ఈ కేటాయింపుల్లో 20ఏళ్లుగా జరుగుతున్నవేనని కాంగ్రెస్‌ సభ్యులు అన్నారు. వచ్చేనెల 8,9తేదిల్లో సమావేశమయి హూకేటాయింపులపై సమీక్షించాలని పీఏసీ నిర్ణయించింది.