వడదెబ్బతో ఇద్దరి మృతి

సుల్తానాబాద్‌,మే26(జనంసాక్షి):
మండలంలోని ఇందిరానగర్‌కు చెందిన నిట్టూరి అంజయ్య(38)సం,లు అనే వ్యక్తి శనివారం ఇందిరానగర్‌లోని తుమ్మచెట్ల వద్ద వడదెబ్బ తాకి మృతిచెందాడు.మృతునికి భార్య పద్మ కుమా రుడు ప్రశాంత్‌,రమ్మ ఉన్నారు.వీరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు.

రామగుండంలో,,రామగుండం పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న దొగ్గెల్లి రాజయ్య(55) శనివారం తెల్లవారుజామున వడదెబ్బతో మృతిచెందాడు. రాజయ్య గత 30 సంవత్సరాల నుంచి హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తె లు, కుమారుడు ఉన్నారు. రామగుండం సిఐ రాజేంద్రప్రసాద్‌, ఎస్‌ఐ శ్రీను మృతుని కుటుంబాన్ని పరామర్శిం చాడు.