వర్తమానంలో పదునైన కవి వనపట్ల సుబ్బయ్య
అగస్టు 29(జనంసాక్షి)
కన్నీరు, ఆకలి, వలసల గురించి రాసి నేడు పారుతున్న నీళ్లు, పండుతున్న పంటల గురించి రాస్తున్న కవులు
కోల్పోయిన జీవితం గురించి తిరిగొచ్చిన జీవితం గురించి రాస్తున్న అరుదయిన కవులు
సుబ్బయ్య రచనలకు నేను అభిమానిని .. ఉద్యమ సమయంలో మశాల్, దీర్ఘకవిత అత్యధ్బుత రచనలు
గుజరాత్ మారణహోమంపై తల్లి శవము పక్కనే పిల్ల పాల కేడ్వగా అని మిత్ర రాసిన పాట పాడిన విమల పాట ఆవేదనా భరితం
కొన్ని పాటలు అందరినీ కదిలించి కొత్త పరిణామాలకు దారి తీస్తాయి
భారతదేశంలో జరుగుతున్న పరిణామాలపై అందరూ వివేకంతో స్పందించాలి
మేధావుల మౌనం మూలంగా నాగరికత నుండి అనాగరికత వైపు పయనిస్తూన్నాం అని భావిస్తున్నాను
హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సాహితీ మాణిక్యం పురస్కార ప్రధాన సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన మంత్రి పువ్వాడ అజయ్ గారు
పురస్కారాలు అందుకున్న ఆకెళ్ల రవి ప్రకాష్, డాక్టర్ షాజహానా, జూపాక సుభద్ర, వనపట్ల సుబ్బయ్య గార్లు