వాన్‌పిక్ కేసులో నేడు సీబీఐ ఛార్జ్‌షిట్
హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో భాగంగా వాన్‌పిక్ సంస్థకు భూముల కేటాయింపు వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ఛార్జ్‌షీటీ దాఖలు చేసేందుకు సీబీఐ అధికారులు సిద్దమయ్యారు. వాన్‌పిక్ ప్రతినిధులు నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలను సీబీఐ అరెస్టు చేసి ఇప్పటికి 90 రోజులు అవుతున్నందున ఈ రోజు నాంపల్లి కోర్టులో ఛార్జ్‌పీట్ దాఖలు చేయనున్నారు. ఈ ఛార్జ్‌షీటులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి నిమ్మగడ్డ ప్రసాద్, మోపిదేవి, బ్రహ్మానందరెడ్డిలతో పాటు మరో పదికిపైగా పేర్లు నిందితుల జాబితాలో ఉండే అవకాశాలు ఉన్నాయి.