వావిలాలపల్లిలో బాలిక అపహరణ

కరీంనగర్‌: వావిలాలపల్లిలో ఓ బాలిక అపహరణకు గురైంది. శ్రీనివాస్‌, భాగ్యలక్ష్మి దంపతుల కూతురు 7 నెలల చిన్నారిని రాత్రి సమయంలో దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి తన భర్త సినిమాకు వెళ్లారని, ఇంట్లో తలుపులకు గడియ వేయకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి పాపను ఎత్తుకుపోయారని తల్లి తెలిపింది.