వాహనం బోల్లా… 16 మంది అమర్‌నాథ్ యాత్రికుల మృతి
జమ్మూ: అమర్‌నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. సాంబ జిల్లా మాన్సర్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున యాత్రకులతో వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 16 మంది యాత్రికులు మృతి చెందరా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ ట్రక్కులో 34 మంది యాత్రికులు అమర్‌నాథ్ నుంచి తిరుగుప్రయాణం అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగ్రాతులను జమ్మూ ప్రభుత్వ మెడికల్ కళాశాల అసుపత్రికి తరలించారు. ఘటన స్థలంలో సైన్యం, అధికార సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది.