వాహనాల తనిఖీ.

: వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్సై రాజశేఖర్.
బెల్లంపల్లి, సెప్టెంబర్25,(జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం మన్నెగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై ఆదివారం నెన్నెల ఎస్సై రాజశేఖర్ వాహనాల తనిఖీ చేపట్టారు. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా అటవీ ప్రాంతం అయిన ఖర్జి, జంగాల్ పేట నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని వాహనదారులకు సూచించారు. ఈసందర్భంగా ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ మండలంలో మావోయిస్టుల ఉనికి ఏమాత్రం లేదని అన్నారు. మావోయిస్టుల గురించి భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదని, ఏదైనా సమాచారం గాని, అనుమానిత వ్యక్తులు గాని ఉంటే వెంటనే డయల్ 100 కు గాని, లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కు గాని ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉంచబడుతాయని వివరించారు. ఈ వాహన తనిఖీలో సిబ్బంది అనంత రావు, సంతోష్, రాములు పాల్గొన్నారు.