వికలాంగులకు అసెంబ్లీలో ప్రత్యేక బడ్జేట్‌ను ప్రవేశపెట్టాలి

వికారాబాద్‌:  వికలాంగులకు అసెంబ్లీలో ప్రత్యేక బడ్జేట్‌ను ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. వికారాబాద్‌లోని అంబేద్కర్‌ భవన్‌లో వికలాంగుల రాజ్యాధికారసభలో ఆయన ప్రసంగించారు. వికలాంగుల ప్రయోజనాలపై ఎవరు కృషి చేయటంలేదని, వికటాంగులు చైతన్యవంతులై హక్కుల సాధన కోసం ఉద్యమించాలని పిలుపినిచ్చారు.