వికలాంగుల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌తో మందకృష్ణ భేటీ
హైదరాబాద్: వికలాంగుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆర్యమానికి మద్దతు ఇవ్వాలని తెరాస అధినేత కేసీఆర్‌ను ఎమ్మార్పీఎన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కోరారు. వికలాంగులకు 7 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 28న హైదరాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వికలాంగుల పిఛన్‌ను రూ.500 నుంచి రూ.1,500లకు పెంచాలని, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 7 శాతానికి పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు మంద కృష్ణ కేసీఆర్‌కు వివరించారు. ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని కేసీఆర్ హీమీ ఇచ్చారని మంద కృష్ణమాదిగ మీడియాకు తెలిపారు. 28న జరిగే సభలో తాము కూడా పాల్గొంటామని కేసీఆర్ చెప్పారని వివరించారు.