విజయమ్మ దిష్టిబొమ్మ దహనం

సారంగాపూర్‌,జులై 21 (జనంసాక్షి): చేనేత రైతుల ఆత్మహత్మల నేపథ్యంలో వైఎస్‌ఆర్సీ పార్టీ గౌరవ అధ్యక్షులు వైఎస్‌ విజయమ్మ సిరిసిల్లలో దీక్ష చేపట్టిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణపై స్పష్టమైన వైఖరి తెలిపినట్లైతేనే తెలంగాణలో వైఎస్‌ఆర్సీ పార్టి నాయకులను అడుగుపెట్టనిస్తామని,లేదంటే మరో మానుకోట పునరావృతమౌతుందని తెరాస శ్రేణులు డిమాండ్‌ చేస్తున్నాయి.ఈసందర్బంగా సారంగాపూర్‌ మండల తెరాస శాఖ కన్వినర్‌ బైరి మల్లేశ్‌ యాదవ్‌ ఆద్వర్యంలో శనివారం వారు మండల కేంద్రంలో వైఎస్‌ విజయమ్మ దిష్టిబొమ్మను దగ్దం చేసారు.ఈసందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా తెలంగాణ గడ్డపై అడుగు పెడితే మరో మానుకోట ఘటన పునరావృతం కాకతప్పదని అలాంటి పరిస్థితి రానివ్వద్దని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో సిగిరి రాజరెడ్డి,ఎండబెట్ల ప్రసాద్‌,మోర్తాడ్‌ సాయి,ప్రేమ్‌చంద్‌, వెంక టేష్‌;పల్లె రమేష్‌,మరియాల శేఖర్‌,తదితరులు పాల్గొన్నారు.