విజయరాఘవకు కోర్టులో చుక్కెదురు

కోనేరు ప్రసాద్‌ జైల్‌ నుంచి విడుదల
హైదరాబాద్‌, ఆగస్టు 3 : ఎమ్మార్‌ కేసులో నిందితుడు విజయరాఘవ బెయిల్‌ పిటిషన్‌ను నాంపల్లిలోని సీబీఐ కోర్టు కొట్టివేసింది. విజయరాఘవకు బెయిల్‌ ఇవ్వదంటూ సీబీఐ వాదించిందింది. విల్లాల విక్రయాలలో విజయరాఘవ అక్రమాలకు పాల్పడినట్టు తాము సాక్షదారాలు సేకరించామని కోర్టుకు తెలిపింది. ఈ విషయానికి సంబంధించి మరన్నీ వివరాలను తెలుసుకోవాల్సి ఉందని ఇలోగా విజయరాఘవకు బెయిల్‌ ఇస్తే సాక్ష్యదారాలును తారుమారు చేసే అవకాశం ఉన్నందున బెయిల్‌ మంజూరు చేయవద్దని కోరింది. అయితే ఇప్పటికే సీబీఐ దర్యాప్తు పూర్తి చేసిందని సాక్ష్యాదారులు కూడా సేకరించామని చెబుతునందున తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ విజయరాఘవ కోరారు. ఉభయ పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తన తీర్పు విలవరిస్తూ ప్రస్తుతం కీలక దశలో ఉన్నందున బెయిల్‌ ఇవ్వలేమంటూ విజయరాఘవ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఇదిలా ఉండగా ఇదే కేసులో నిందితుడుగా ఉన్న ఐఏఎస్‌ అధికారి బి.సి ఆచార్య బెయిల్‌ పిటిషన్‌పై విచారణను 7వ తేదీకి వాయిదా వేసింది. సీబీఐ ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేసినందున తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ ఆచ్యార దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ శుక్రవారంనాడు కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. తదుపరి విచారణను కోర్టు 7వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ఎమ్మార్‌ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన కోనేరు రాజేంద్రప్రసాద్‌కు బెయిల్‌ మంజూరు కావడంతో శుక్రవాంరనాడు ఆయన చంచెల్‌గూడ జైల్‌ నుంచి విడుదల అయ్యారు. గురువారంనాడు ఆయనకు హైకోర్టులో షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు అయిన విషయం తెలిసిందే. 5 లక్షల రూపాయలతో ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని హైకోర్టు షరతు విధించింది. రాష్ట్రం విడిచి వెళ్లరాదని కేసు దర్యాప్తునకు అందుబాటులో ఉండాలని కింది కోర్టులో స్వాధీనం చేసి ఉండకపోతే ఇప్పుడు దాని స్వాధీనం చేయాలని షరతు విధిస్తూ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గురువారంనాడు కోర్టు ఉత్తర్వులు జైల్‌ అధికారులకు చేరడంలో ఆలస్యమైనందున శుక్రవారంనాడు కోనేరు ప్రసాద్‌ జైల్‌ నుంచి విడుదలయ్యారు. గత 9 నెలలుగా ఆయన చంచెల్‌గూడ జైల్‌లో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.