విజయవాడ కోర్టులో బాంబు కలకలం

విజయవాడ,నవంబర్‌21: విజయవాడ కోర్టు ప్రాంగణంలో బాంబు ఉందంటూ వచ్చిన ఫోన్‌ కాల్‌ కలకలం రేపింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబు ఉందన్న సమాచరంతో కోర్టులో ఉన్నవారు పరుగులు తీసారు. బాంబు స్క్వాడ్‌ రంగంలోకి దిగి కోర్టు ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ముమ్మరంగా గాలింపు చేపట్టారు. చివరకు బాంబు ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు కన్పించకపోవడంతో అందరూ తేలిగ్గా వూపిరి పీల్చుకున్నారు. ఫోన్‌కాల్‌ ఎక్కడినుంచి వచ్చిందన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది ఉత్తుత్తి కాల్‌గా భావిస్తున్నారు.