విజయ పాల డైరీ ధరల పెంపు

హైదరాబాద్‌: రాష్ట్రంలో తాజాగా విజయడైరీ పాల ఉత్పత్తి చేస్తున్న పాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకొంది. లీటరుకు 2.రూ.చొప్పున ధర పెరిగినట్లు విజయ డైరీ ప్రకటించింది. కొత్త ధరలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. పాలు, విద్యుత్‌, నీరు, ఆయిల్‌, డీజిల్‌, బొగ్గు ధరలు, సిబ్బంది వేతనాలు పెరిగిన దృష్ట్యా విజయడైరీ ఉత్పత్తులపై ధరలు పెంపు అనివార్యమైందని ఆ సంస్థ ప్రకటించింది.