విత్తనాల పంపీణీ ప్రారంభం

బోధన్‌ పట్టణం: బోధన్‌ మండలంలోని రైతులకు రాయితీ సోయా విత్తనాల పంపీణీ కార్యక్రమాన్ని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ గంగాశంకర్‌ ప్రారంభించారు. మండలంలోని 21వేల ఎకరాల్లో సోయా సాగు అంచనాతో 6,300 క్వింటాళ్ల సోయా విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖకు నివేదించగా మొదటి విడతలో 5,300 క్వింటాళ్లు విడుదలయ్యాయి.ఈ విత్తనాలనే రెండు రోజులకు ఐదు గ్రామాల చొప్పున ఈ నెల 19 లోగా మండలంలో పంపీణీ కార్యక్రమాన్ని ముగించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.