విదేశీ విద్యకు సహకారంపై హైదరాబాద్‌లో సదస్సు

హైదరాబాద్‌: విదేశాల్లో డిగ్రీ,పీజీ స్థాయి విద్యాభ్యాసం చేయాలనుకునేవారికి సహకరించే ఉద్దేశంతో ‘ఈజీఈ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌’ ‘ఐవీఐ కాంక్లేవ్‌’ సంస్థలు సంయుక్తంగా హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించారు. అమెరికాలో 8ప్రథమశ్రేణి విశ్వవిద్యాలయాల కూటమి అయిన ఐవీఐ లీగ్‌ కాంక్లేవ్‌ ఇక్కడి విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు నిర్ధిష్టమైన సలహాలు సూచనలు ఇస్తుందని ఈజీఈ ప్రతినిధులు తెలిపారు. పెన్నిల్వేనియా వంటి ప్రఖ్యాత అమెరికన్‌ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదివేందుకు ఒక విద్యార్థికి ఏడాదికి 50వేల అమెరికన్‌ డాలర్లు ఖర్చు అవుతుందని అయితే విద్యార్థి సామార్ధ్యాన్నిబట్టి 10నుంచి80శాతం వరకు స్కాలర్‌షిప్‌లు లభించు అవకాశముందని అన్నారు.