విద్యాశాఖలో అవినీతికి పాల్పడిన మాజీ అధికారికి జైటు శిక్ష

న్యూఢిల్లీ: ఉన్నత విద్యాశాఖలో లవినీతికి పాల్పడిన మాజీ సీనియర్‌ అధికారి ఒకరికి సీబీఐ ప్రత్యేక కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. పోర్జరీ సంతకాలతో కూడిన బిల్లులు సమర్పించినందుకు ఆయనకు ఈ శిక్ష పడింది. ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడటం చాలా తీవ్రమైన అంశంమని కోర్టు వ్యాఖ్యానించింది. 2008లో కర్ణాటకలోని మైసూర్‌లో ఒక సెమినార్‌ నిర్వహించగా దానికి హాజరుకాని 14 మంది సంతకాలను ఈయన ఫోర్జరీ చేసి బిల్లులు కాజేసినట్లు తేలింది. ఈ సందర్భంగా సీబీఐ నాయమూర్తి సంజీవ్‌ జైన్‌ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడడం చాలా తీవ్రమైన విషయం. ఇందులో ఉదాసీనత ప్రదర్శించలేం అని స్పష్టం చేశారు.