విద్యా కళాశాలల్లో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని వృత్తి విద్యా కళాశాలల్లో సెప్టెంబర్‌ రెండవ తేదీనుంచి టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరులోపు జల్లా ప్రాంతీయ స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటుచేసి వచ్చే నెల 2నుంచి తనిఖీలు చేస్తామన్నారు. మూడు నెలల్లో తనిఖీలు పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామన్నారు. ఏఐసీటిఈతోపాటు అనుబంధ విశ్వవిద్యాలయం నిబంధనల మేరకు ఈ తనిఖీలు జరుగుతాయని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యుడు, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ అజయ్‌జైన్‌ తెలిపారు.