విద్యుత్‌ కోతలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి తెరాస నేతలు

హైదరాబాద్‌: విద్యుత్‌ కోతలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని తెరాస ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. వ్యవసాయానికి ఎన్ని గంటల విద్యుత్‌ ఇస్తుందో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని హరీశ్‌రావు అన్నారు. వృథా అవుతున్న విద్యుత్‌ను ఆదా చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ధర్మల్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు కోరారు. విద్యుత్‌ సమస్యపై ఏ ఒక్క  మంత్రి అయినా సమీక్ష నిర్వహించారా అని ఆయన ప్రశ్నించారు. కుర్చీలు కాపాడుకునేందుకు మంత్రులు సీఎంను కలుస్తున్నారు. తప్ప. రైతులను పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు.