విద్యుదాఘాతానికి నలుగురు పిల్లల సజీవ దహనం

ఏలూరు : అంగన్‌వాడీ కేంద్రం నుంచి తాము ఉంటున్న పూరిపాకకు వచ్చిన పిల్లలు ఫ్యాన్‌ స్విచ్‌ వేయడానికి ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురయ్యారు. ఆ సమయంలో దినసరి కార్మికులైన వారి తల్లిదండ్రులు పనికి వెళ్లారు. దగ్ధమైపోతున్న పూరిపాక నుంచి దట్టమైన పొగ మధ్య పిల్లల రోదనలు విన్న ఇరుగుపొరుగువారు కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం విఫలమైంది. మృతిచెందిన పిల్లలను గురివిందపల్లి నాగరాజు, రుణల సంతానం గురివిందపల్లి పాండు (3), భోగేశ్వరి (4), పి.రాధాకృష్ణ, దేవతామాతల కుమారుడు పెనుమాక గౌరీశంకర్‌ (5), పెనుమాక శివనాగరాజు, సునీతల కుమారుడు కళాసాగర్‌ (3)గా గుర్తించారు. సెదనేగి ఎస్‌ఐ ఆనందరెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. దేహాలకు శవపరీక్ష నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.