విద్యుదుత్పత్తి కొనుగోలు పంపిణీపై శ్వేతపత్రం విడుదల చేయాలి

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుదుత్పతి&్త కోనుగోలు, పంపిణీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు డిమాండ్‌ చేశారు. విద్యుత్తు కొరత ఏర్పడుతుందని ముందే తెలిసినా ముఖ్యమంత్రి, ప్రభుత్వం నిర్లక్ష్యం చేశారని ఫలితంగానే విద్యుత్తు కోతలు పెరిగాయని విమర్శించారు. రాష్ట్రానికి ఆదనపు విద్యుత్తు గ్యాస్‌ కేటాయింపుల కోసం ముఖ్యమంత్రి రాస్తున్న ఉత్తరాలు చిత్తుకాగితాలుగానే మారుతున్నాయాన్నారు. రైతులకు 7 గంటల విద్యుత్తు ఇస్తానని ఏ ప్రాతిపదికన మాట్లాడారని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు ఇకపై ఉమ్మడి ఉద్యమాలకు శ్రీకారం చుడతామన్నారు. ఈ నెల 28న విద్యుత్తు అమరవీరుల దినం సందర్బంగా సమరశీల నిరసన తెలపనున్నట్లు వెల్లడించారు.