వినియోగదారులను చైతన్యవంతులను చేస్తాం

కడప, జూలై 25 : వినియోగదారులను అన్ని విధాలా చైతన్యవంతులను చేస్తామని జిల్లా కన్జ్యూమర్స్‌ ఇన్పర్మేషన్‌ సెంటర్‌ కన్వీనర్‌ రమేష్‌ బుధవారం ఇక్కడ అన్నారు. వినియోగదారులకు అన్యాయం జరిగితే వారి తరఫున న్యాయపోరాటాలు జరుపుతామని అన్నారు. వినియోగదారులు ఎక్కడ మోసపోయినా తమ దృష్టికి తేవాలని చెప్పారు. కాగా వినియోగదారులు సరైన ఆధారాలతో ఫిర్యాదులు చేయాలని చెప్పారు. వినియోగదారులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటామని ఆయన చెప్పారు.