హత్యాయత్నం నిందితుడి రిమాండ్

 

 

 

 

 

 

భూదాన్‌ పోచంపల్లి, నవంబర్‌ 22 (జనం సాక్షి): పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన మహమద్‌ నవాజ్‌ తన మేనబావమరిది షేక్ నవీద్‌పై పాతకక్షల కారణంగా బీర్‌ సీసాతో దాడి చేసి హత్యాయత్నం చేసిన కేసులో పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో పోచంపల్లి పోలీసులు శుక్రవారం ఉదయం అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నవాజ్‌ నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఎస్‌.ఐ భాస్కర్‌ రెడ్డి అతనిని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించి నల్గొండ జైలుకు పంపించారు.