దృష్టి మరల్చేందుకే ‘డైవర్షన్’

నవంబర్ 21 (జనం సాక్షి):ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు. పెద్దపల్లిలోని తెలంగాణభవన్‌లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన మాట్లాడుతూ అసలు ఫార్ములా ఈ-రేస్ రద్దు చేసినందుకు సీఎంపై విచారణ జరిపించాలని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మా ట్లాడుతూ ఇచ్చి న హామీలు నెరవేర్చకుండా సీఎం రేవంత్ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. స్థాని క ఎన్నికల నుంచి ప్రజల అటెన్షన్‌ను డైవర్షన్ చేసేందుకు ఈ-కార్ కేసును తెరమీదికి తెస్తున్నారని మండిపడ్డారు.



