అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం.

పరకాల, నవంబర్ 22 (జనం సాక్షి):
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని పరకాల శాసనసభ్యులు ప్రకాశ్ రెడ్డి అన్నారు.శుక్రవారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో పరకాల పట్టణం, పరకాల, నడికూడా మండలాలకు చెందిన 55 మంది లబ్ధిదారులకు 55 లక్షల 64వేల 80రూ విలువగల కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ చెక్కులు మరియు 27 మంది లబ్ధిదారులకు 6 లక్షల 78500రూ విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిలుస్తుంది అని,కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డల పెళ్ళికి వరంగా మారిందన్నారు.పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లి భారం తగ్గిందని పేర్కొన్నారు.గత ప్రభుత్వా నిర్లక్ష్యం వైఖరి వల్ల కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆలస్యం అయ్యాయని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో సకాలంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందేలా కృషి చేస్తామని తెలిపారు.పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని, ఇది ప్రజల ప్రభుత్వం అని అన్నారు.పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందని అన్నారు.ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం,200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు,ఏకకాలంలో రైతు రుణమాఫీ, పేద ప్రజలకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, సన్న వడ్లకు రూ 500 బోనస్, ఇందిరమ్మ ఇల్లు, ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని అంచలంచలుగా అమలు చేస్తున్నామని తెలిపారు.


