టేకులపల్లి మండలంలో మరో ఆణిముత్యం

 

 

 

 

 

టేకులపల్లి, నవంబర్ 22(జనంసాక్షి):

జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ప్రథమ బహుమతి
 సీఎం చేతులు మీదుగా బెస్ట్ ఎక్సలెంట్ ఛాంపియన్షిప్ అవార్డ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ప్రగల్లపాడు ఉమ్మడి పంచాయతీలోని పాత తండాకు చెందిన మరో ఆణిముత్యం ‘పాల్తియ కిరణ్ నాయక్’ ఒరిస్సాలో జరిగిన నేషనల్ లెవెల్ స్విమ్మింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహించి మొదటి బహుమతి సాధించారు. ఈ ప్రతిభను కనబరిచినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా”బెస్ట్ ఎక్స్లెంట్ ఛాంపియన్షిప్ అవార్డు” ను అందుకున్నారు. పూణేలో జరగనున్న
ఖేలో ఇండియా క్రీడలలో పాల్గొనే అర్హత కూడా సాధించడం అభినందనీయం. కిరణ్ నాయక్ ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించి,చాలా పేద కుటుంబానికి చెందినప్పటికీ,అతని ప్రతిభను గుర్తించి ఎల్లప్పుడూ ప్రోత్సహించిన అతని మేన మామ భూక్య హీరాలాల్ కి ప్రత్యేక అభినందనలు మండల ప్రజలు తెలుపుతున్నారు. పూణేలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో కూడా
మొదటి బహుమతిని గెలుచుకోవాలని కోరుకుంటూ, టేకులపల్లి మండలానికి ఎంతో అరుదైన జాతీయస్థాయిలో అవార్డులు పొందుతున్న కిరణ్ నాయక్ కు మండల ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు.