విపత్తుల నిర్వహణ కింద రాష్ట్రానికి రూ. 740 కోట్లు : షిండే

ఏలూరు : జాతీయ విపత్తుల నివారణకు కేంద్ర ప్రభుత్వం మూడు దశలుగా ప్రపంచ బ్యాంక్‌ సహాయంతో తీర ప్రాంత రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే తెలిపారు. మొదటి దశలో 15 వందల కోట్లతో ఆంధ్రా, ఒడిశా తీర ప్రాంతాల్లో రహదారులు, వంతెనల నిర్మాణం, ప్రజలను అప్రమత్తం చేయడానికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు రూ. 720 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. రెండో దశలో కూడా రాష్ట్రారికి అధిక ప్రాధాన్యం ఇస్తామని జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ ఉపాధ్యక్షుడు మర్రిశశీధర్‌రెడ్డి అన్నారు. అంతకుముందు షిండే కాళ్ల మండలం మోడీలో రూ. 8 కోట్లతో నిర్మించనున్న వంతెనకు శంకుస్థాపన చేశారు.