విఫలమైన నాగ్‌ క్షిపణి పరీక్ష

న్యూడిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ రూపోందిస్తున్న ట్యాంకు విధ్వంసక క్షిపణి నాగ్‌ మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ అస్త్రం పరీక్ష ఇటీవల విఫలమైంది.సైన్యానికి చెందిన లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి అధికారులు, రక్షణ పరిశోదన, అభివృద్ది సంస్థ(డీఆర్‌డీఓ) శాస్త్రవేత్తల సమక్షంలో రాజస్థాన్‌లోని మహజన్‌ ఫైరింగ్‌ రేంజ్‌ లో ఈ పరీక్ష జరిగింది. క్షిపణిని మోసుకెళ్లేందుకు ఉపయోగించిన ‘నమికా’ వాహనం కూడా సరిగా పని పనిచేయలేదని డీఆర్‌డీఓ వర్గాలు తెలిపాయి.