విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: బేగంపేట విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విమానాలు మరమ్మతులు చేసే షెడ్డు నుంచి మంటలె ఎగసిపడుతున్నాయి. రాజీవ్‌గాంధీ ఏవియేషన్‌ చెందిన రెండు ఛార్టడ్‌ విమానాలు ఈ ప్రమాదంలో దగ్థమయ్యాయి. ఏడు ఎయిర్‌ఫోర్స్‌ అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలు అర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.