వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ లో చేరికలు

జనం సాక్షి (నవంబర్21)
భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన బిజెపి, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మంగళవారం రోజు మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నర్సింహులు , భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దళిత బంధు, బిసి బందు, గృహలక్ష్మి, షాది ముబారక్ వంటి పథకాలను అమలుపరచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని నాయకులు ఆరోపించారు. పది సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుంటున్నారాని వారు అన్నారు. ఈనెల 30 తారీకునా జరిగే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డిని 50 వేల ఓట్లతో మెజార్టీతో గెలిపించాలని ఇట్టి సమావేశంలోమాజీ గొర్ల కాపరుల సంఘం అధ్యక్షులు మాయ తిరుమలయ్య, గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యులు మాయ వీరస్వామి, సిరికొండ బాలకృష్ణ, జెట్టి వెంకట్ రెడ్డి, నోముల కృష్ణారెడ్డి, రాచర్ల భద్రయ్య, నోముల అంజిరెడ్డి, పిట్టల భాస్కర్, కామునిగూడెం బాలరాజ్, అంతరి విజయ్ కుమార్, సుబ్బూరు మనోజ్, చిదరకంటి నరేష్ లు ఉన్నారు.

తాజావార్తలు