విశాఖలో పర్యటించనున్న ప్రజాపద్దుల సంఘం

హైదరాబాద్‌: ప్రజా పద్దుల సంఘం ఈనెల 24,25 తేదీల్లో విశాఖ జిల్లాలో పర్యటించనుంది. ఈ రోజు సమావేశమైన ప్రజాపద్దుల సంఘం భూకేటాయింపులపై చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో విశాఖలో పర్యటించి హిందుజా పవర్‌ప్లాంట్‌తో పాటు ఇతర భూకేటాయింపులను పరిశీలించాలని సంఘం నిర్ణయించింది.