విశాఖలో భారీగా గంజాయి పట్టివేత

విశాఖపట్నం: జిల్లాలోని రవికమతం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మూడు వాహనాల్లో తరలిస్తున్న 1500కిలోల గంజాయిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేశామని..మరో ముగ్గురు పరారయ్యారని వారు వెల్లడించారు.