విశాఖ స్టీల్‌కు లాభాలు

విశాఖపట్నం: మొదటి త్రైమాసికంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రూ. 361 కోట్ల లాభాలను ఆర్జించినట్టు సీఎండీ చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది మొదటి త్రైమాసికానికి పన్ను మినహాయించగా రూ. 47 కోట్లు మాత్రమే లాభాలు రాగా ఈ ఏడాది రూ. 150 కోట్లు లాభాలను ఆర్జించినట్టు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.