విష జ్వరంతో వ్యవసాయ అధికారి మృతి

 

కాటారం (కరీంనగర్‌) : కాటారం మండలంలోని వ్యవసాయ శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్‌ విష జ్వరంతో మృతి చెందాడు. గత వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ వరంగల్‌లో చికిత్స పోందుతున్నప్పటికి అధికారికి నయం కాలేదు. దీంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించే క్రమంలో అయన అదివారం ఉదయం మృతి చెందినట్లు మహదేవ్‌పూర్‌ ఏడీఏ సునీత తెలిపారు సుదాకర్‌ గత మూడు సంవత్సరాలుగా మండలంలో వ్యవసాయాధికారి మృతికి సంతాపంగా కాటారం మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను మూసివేసి వ్యాపారాలు సంతాపం ప్రకటించారు