వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి మజ్లిస్ పార్టీ జహీరాబాద్ అధ్యక్షులు అత్తర్ అహ్మద్
జహీరాబాద్ ఆగస్టు 5 (జనంసాక్షి)
వీఆర్ఏలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలి అని మజ్లిస్ పార్టీ జహీరాబాద్ అధ్యక్షులు అత్తర్ అహ్మద్ అన్నారు. శుక్రవారం అయన వి అర్ ఏ లకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ
55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ ల వారసులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి అన్నారు.
అర్హత కలిగిన వీఆర్ఏలను ప్రమోషన్లు ఇవ్వాలి అని
గత పండెండు రోజుల నుండి నిర్వాదిక సమ్మె నిర్వహిస్తున్నారు దీక్ష శిబిరానికి చేరుకుని తన పార్టీ వివిధ వార్డుల అధ్యక్షులు పార్టీ నాయకులతో కలిసి దీక్ష లో కూర్చున్న వారికి పూల మాలలు వేసి మద్దతు తెలిపారు అత్తర్ అహ్మద్ మాట్లాడుతూ మజ్లిస్ పార్టీ ఎప్పుడు అందరీ కోసం పని చేస్తుందని ట్రేడ్ యూనియన్లు గాని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగస్థులకు కార్మికుల కు అసద్ ఉద్దీన్ ఓవైసీ మరియు అక్బర్ ఉద్దీన్ ఓవైసీ ఎప్పుడూ మద్దతు చేస్తు వచ్చారు మీకు ఎల్లప్పుడూ మజ్లిస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ అమీర్ బిన్ అబ్దుల్లా వివిధ వార్డుల అధ్యక్షులు అయ్యుబ్, రాషెద్, మెుహ్సిన్, రహీమ్, ముజీబ్, షఫి, నాయకులు షరీఫ్, సమీర్, వలి, జుబేర్, రఫీఖ్ తదితరులు పాల్గొన్నారు