వీఆర్వో కార్యాలయం ప్రారంభం

చిలుకూరు: మండలంలోని బేతవోలు గ్రామంలో వీఆర్వో కార్యాలయాన్ని మండల తాహసిల్దారు ఎన్‌. సూర్యనారాయణ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, విద్యార్థులు తమకు కావాల్సిన ధ్రువపత్రాలను వీఆర్వో కార్యాలయం నుంచి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.ఐ. జయమ్మ, వీఆర్వో శ్రీనివాసరావు, గ్రామ కార్యదర్శి షరీపుద్దీన్‌, సీపీఎం మండల కార్యదర్శి నాగయ్య , మాజీ ఉపసర్పంచి శ్రీనివాసరావు, సీపీఐ నాయకులు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ నాయకులు ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.