వీక్లీ మార్కెట్‌లో కూరగాయల విక్రయానికి అనుమతివ్వాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 6 : నగరంలోని వీక్లీబజార్‌లో రోడ్లపై కూరగాయాలు అమ్ముకోవటా నికి అనుమతినివ్వాలని కోరుతూ సిఐటియు ఆద్వర్యంలో మంగళవారం వీక్లీ మార్కెట్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మీ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా వీక్లీ మార్కెట్‌లో వంద కుటుంబాలు కూరగాయాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది కల్గించలేదని, కాని ప్రస్తుతం కార్పొరేషన్‌ అధికా రులు ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉన్నాయన్న నేపంతో వ్యాపారులపై దాడులు చేస్తు న్నారని అన్నారు. రోజు రోడ్లపై కూరగా యలు అమ్ముకుంటున్న వారి నుంచి పన్నులు వసూలు చేసుకుంటూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారని, ఈ విధమైన దాడులకు పాల్పడడం సరైంది కాదన్నారు. రోడ్లపై కూరగాయాలు అమ్ముకోవడానికి అనుమతినియ్యాలని, మార్కెట్‌యార్డు నుంచి లైసెన్సులు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. ధర్నా లో సిఐటియు నాయకులు  నూర్జహాన్‌, సుజాత, రాములు, పద్మ తదితరులున్నారు.